శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (08:43 IST)

పరుగులు పెడుతున్న పసిడి ధరలు

దేశంలో పసిడి ధరలు మరోమారు పరుగులు పెడుతున్నాయి. తాజాగా పసిడి ధరలు మంగళవారంతో పోల్చుకుంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం కాస్త తగ్గిన పసిడి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. 
 
దేశంలో 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 46,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర50,830గా ఉంది. అయితే.. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
 
హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పైకి పెరిగి ధర రూ.48,490కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.44,450కు చేరింది. ఇక, వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర రూ.67,700కు చేరింది.
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర50,830గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,650వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.44,850 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,930 వద్ద కొనసాగుతోంది.