బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 ఆగస్టు 2021 (08:56 IST)

కొండెక్కిన పసిడి.. రేటు తగ్గిన వెండి : ఎంత తగ్గిందంటే...

పసిడి ప్రియులకు చేదువార్త కాగా, వెండి కొనుగోలుదార్లకు మాత్రం ఇది శుభవార్తే. బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఇటీవల 10 రోజుల పాటు వరుసగా తగ్గిన పసిడి ధర.. ఇప్పుడు క్రమంగా మళ్లీ పెరుగుతుంది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు మాత్రం పడిపోయింది.
 
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.48,330కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.44,300కు ఎగసింది. ఇక, వెండి రేటు రూ.400 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,200కు చేరింది.
 
దేశవ్యాప్తంగా బంగారం రేట్లు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు విశాఖ, విజయవాడ, బెంగళూరులో రూ.44,300గా ఉంది. చెన్నైలో రూ.44,640, ముంబైలో 46,500, కోల్‌కతాలో రూ.46,750, కేరళలో రూ.44,300 పలుకుతోంది. 
 
24 క్యారెట్ల బంగారం ధరలు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో రూ.48,330 పలుకుతోంది. ఇక చెన్నైలో 48,700, ముంబైలో 47,500, న్యూఢిల్లీలో రూ.50,660, కోల్‌కతాలో రూ.49,450గా ఉంది.