సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (15:45 IST)

సబ్సిడీయేతర గ్యాస్‌ బండపై రూ.25 మేర పెంపు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి. మరోపక్క దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గ్యాస్‌ ధరలో పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 12 వరకు సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది. 
 
తాజాగా వంటగ్యాస్ ధరలు పెరిగాయి. సబ్సిడీయేతర గ్యాస్‌ బండపై రూ.25 మేర పెరిగింది. ఈ ధరలు ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు బుధవారం ఓ వార్తా సంస్థ వెల్లడించింది. కొత్త ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దిల్లీ, ముంబయిలో ఒక సిలిండర్ ధర రూ.859.50గా ఉంది. కోల్‌కతాలో అత్యధికంగా రూ.886కి చేరుకుంది. ఇప్పటికే జులై 1న ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగిన సంగతి తెలిసిందే.