శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 ఆగస్టు 2021 (22:19 IST)

జియోఫోన్ నెక్ట్స్.. సెప్టెంబర్ 10న విడుదల... ఫీచర్స్ లీక్

Jio
జియోఫోన్ నెక్ట్స్ భారతదేశంలో వచ్చే నెల సెప్టెంబర్ 10న విడుదల కానుంది. ఈ ఫోనుకు సంబంధించిన ధర, ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ప్రపంచంలో ఇదే అత్యంత చౌకైన ఫోన్ కావడం గమనార్హం.

తాజాగా, ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలను టిప్ స్టార్ యోగేష్ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నట్లు ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకోని వస్తున్నట్లు ఇతను కూడా ధృవీకరించారు.
 
జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ ఫీచర్స్(అంచనా):
4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
2,500 ఎంఏహెచ్ బ్యాటరీ
2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్
క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్)