బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (17:51 IST)

భారీగా పెరిగిన బంగారం ధర: ఒక్క రోజే రూ.300లు పెంపు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 300 రూపాయలకు పైగా పెరిగింది. కేవలం గత వారం రోజుల్లో బంగారం ధర 1,500 రూపాయలకు పైగా పడిపోయింది. బులియన్ జేవెల్లరి మార్కెట్లో ఆగస్టు 5న రూ.48,000గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.300 పెరిగి రూ.46500కు చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.42,683కు చేరుకుంది.
 
ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగానే పెరిగియాయి. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,300 నుంచి రూ.260 పెరిగి రూ.47,560కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,350 నుంచి రూ.43,600 పెరిగింది. బంగారం పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గిపోయాయి.