విద్యార్థిని గదికి పిలిచి మత్తుమందు కలిపి ఇచ్చిన కంప్యూటర్ టీచర్, ఆ తరువాత ఏమైంది?
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు ఆమె. కోరికలను తట్టుకోలేకపోయింది. దీంతో తన విద్యార్థులతో తన కోర్కెను తీర్చుకోవాలనుకుంది. కానీ చివరకు ఊచలు లెక్కిస్తోంది.
హైదరాబాద్ రామాంతపూర్ లోని ఒక ప్రైవేటు డిగ్రీ కళాశాల అది. బి.కాం మొదటి సంవత్సరం చదువుతున్న మోహన్ పరుగెత్తుకుంటూ ప్రిన్సిపల్ గదికి వచ్చాడు. సర్..నన్ను కంప్యూటర్ టీచర్ మత్తు పదార్థం ఇచ్చి లోబరుచుకుంది. తన గదిలోకి తీసుకెళ్ళి నన్ను శారీరకంగా వాడుకుంది అంటూ ఫిర్యాదు చేశాడు.
అంతేకాదు తన మెయిల్‌కు కంప్యూటర్ టీచర్ అశ్లీల వీడియోలు, ఫోటోలను పంపించిందంటూ ప్రిన్సిపల్‌కు చూపించాడు. వాటిని చూసిన ప్రిన్సిపల్ షాకయ్యాడు. ఎప్పుడు తన పని తాను చూసుకుంటూ వెళుతూ సైలెంట్‌గా ఉండే కంప్యూటర్ టీచర్ సోని ఇలా చేసిందా అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు మోహన్ మెయిల్స్‌ను చెక్ చేశారు. ఆ తరువాత సోనిని విచారించారు. దీంతో అసలు విషయాన్ని ఒప్పేసుకుంది సోని. మోహన్‌ను తన గదికి తీసుకెళ్ళి కాఫీలో మత్తు మందు కలిపి ఇచ్చినట్లు ఒప్పుకుంది. ఆ తరువాత శారీరకంగా తనను లోబరుచుకున్నట్లు కూడా విచారణలో వెల్లడించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సోనిని కళాశాల యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది.