1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Lockdown restrictions to be eased in Telangana

తెలంగాణాలో లాక్డౌన్ ఆంక్షల సడలింపు... రేపు నిర్ణయం?

Lockdown Restrictions
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్డౌన్‌ను అమలు చేస్తుండటంతో  కేసులు తగ్గుతున్నాయి. అదేసమయంలో కరోనా ఆంక్షలను మరింతగా సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 
 
ప్రస్తుతం ఒంటిగంట వరకు సడలింపులు ఉండగా, దీనిని సాయంత్రం 5 గంటల వరకు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, ఆ సమయంలో రోడ్లపై ఉన్న వారు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా మరో గంట సమయం ఇవ్వాలని భావిస్తోంది.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలు ఈ నెల 9తో ముగియనున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించడంతోపాటు రాత్రిపూట మాత్రం కర్ప్యూను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ నగరంలోని ఈ లాక్డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బెంగుళూరుకు కొత్త పేరు.. పోటీపడిన నెటిజన్లు... విజేతకు హైస్పీడ్ కారు