1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Massive Fire Accident in Nizamabad Vinayakar Super Market

నిజామాబాద్ వినాయకర్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

fire accident
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ నగరం, వినాయకర్ మార్కెట్‌లో శనివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలో ఉన్న సూపర్ మార్కెట్‌లో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గిపాలైంది. ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
అయితే, అర్థరాత్రి సమయంలో ఈ అగ్నిప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. దీంతో వ్యాపారాలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగిన వెంటనే దట్టమైన పొగలు అలముకున్నాయి. దీంతో స్థానికులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. 
తర్వాతి కథనం
29న రియలన్స్ 45వ వార్షిక సర్వ సభ్య సమావేశం