సంబంధిత వార్తలు
- హైదరాబాద్: కారులో ఉన్నట్టుండి మంటలు
- హైదరాబాద్లో వేసిన సెట్లో దసరా' భారీ షెడ్యూల్ ప్రారంభం
- శుభవార్త చెప్పిన ఆయిల్ కంపెనీలు - వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు అప్.. జూలై 1 నుంచే అమలు
- ‘సాలు దొర, సెలవు దొర’...‘సాలు మోదీ, సంపకు మోదీ’... హైదరాబాద్ వేదికగా టీఆర్ఎస్, బీజేపీ ప్రకటనల యుద్ధం
ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్: భారీగా బందోబస్తు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ప్రధాని మోదీ శనివారం హైదరాబాదులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు , బీజేపీ అగ్ర నేతలు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పటు చేసింది.
హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో జూలై 02, 03 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. జూలై 03వ తేదీన పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
జులై 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొని, ఆ తర్వాత రాజ్ భవన్ లో బస చేస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
