సంబంధిత వార్తలు
- కాంగ్రెస్ కి ఝలక్: మోదీకి జై కొట్టిన జ్యోతిరాదిత్య సింధియా, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు
- కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్
- చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి టీడీపీ యువనేత
- కాంగ్రెస్ పార్టీకి రాములమ్మ షాక్... మోదీ సర్కారుకి జై... ఏం జరుగుతోంది?
- హైకోర్టులో శివాజీకి ఊరట: లుకౌట్ నోటీసులు తొలగింపునకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ కాంగ్రెసుకు షాక్: బిజెపిలోకి వివేక్
మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ బిజెపిలో చేరడం ఖాయమైంది. కాంగ్రెసు పార్టీలో కొనసాగుతారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, కాంగ్రెసుకు షాక్ ఇస్తూ ఆయన బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. వివేక్ తమ పార్టీలో చేరుతున్నట్లు బిజెపి నేతలు స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ వివేక్ యూటర్న్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీలో చేరకుండా సీఎం కేసీఆర్ కి వ్యతిరేకంగా ఆయన పోరాటాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలే బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. బీజేపీ జాతీయాధక్షుడు అమిత్ షాను కలిశారు. త్వరలో పార్టీలో చేరతానని కూడా ప్రకటించారు.
అయితే, వివేక్ టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ ఇంటికి వెళ్లి మరీ దాదాపు గంటపాటు మంతనాలు జరిపారు. తమ పార్టీలో చేరాల్సిందిగా ఉత్తమ్ వివేక్ ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కాంగ్రెసులో చేరుతారని ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి తెర దింపుతూ ఆయన బిజెపిలో చేరడానికి నిర్ణయించుకున్నారు. జాతీయ నేతల సమక్షంలో ఆయన బిజెపిలో చేరనున్నారు.
