భాగ్యనగరంలో వర్ష బీభత్సం... హోర్డింగులు విరిగాయి... కార్లు ధ్వంసమయ్యాయి...
హైదరాబాద్ నగరంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చెట్లు, హోర్డింగులు నేలకొరిగాయి. బలమైన గాలులకు హోర్డింగులు, చెట్లు కార్లపై పడటంతో నష్టం వాటిల్లింది. జూబ్లి హిల్స్ వద్ద ఓ హోర్డింగు నేలకూలడంతో 8 కార్లు ధ్వంసమయ్యాయి. వడగండ్ల వాన పడటమే కాకుండా బల
హైదరాబాద్ నగరంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చెట్లు, హోర్డింగులు నేలకొరిగాయి. బలమైన గాలులకు హోర్డింగులు, చెట్లు కార్లపై పడటంతో నష్టం వాటిల్లింది. జూబ్లి హిల్స్ వద్ద ఓ హోర్డింగు నేలకూలడంతో 8 కార్లు ధ్వంసమయ్యాయి. వడగండ్ల వాన పడటమే కాకుండా బలమైన గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. దీంతో నగరం అంధకారమయమయింది.
జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, నేరేడ్‌మెట్, ఈసీఐఎల్, మాదాపూర్, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్, అమీర్‌పేట, అంబర్‌పేట, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. బంగాళాఖాతంలో రోను తుఫాను కారణంగా వర్ష బీభత్సం సృష్టించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.