సంబంధిత వార్తలు
- ప్రజల కోసమే టికెట్ రేటు తగ్గించాం - ఆన్లైన్ చర్చల్లో వుంది - అల్లుఅరవింద్, బన్నీవాసు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం-ట్రెండింగ్ అవుతున్న ఫోటో
- హైదారాబాద్ మైనర్ బాలిక రేప్ కేసులో హోం మంత్రి మనవడు?
- నేటితో ముగియనున్న గ్రూపు-1 దరఖాస్తు గడువు
- తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు- 49మందికి పాజిటివ్
నేడు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం దేశ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటలకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ జరుగనుంది.
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 50 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం హైదరాబాద్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు, పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులను అనుమతించరు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆడ్మిట్ కార్డు విధిగా చూపించాల్సివుంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. కాగా, ఈ పరీక్షా ఫలితాలను నెల రోజుల లోపు విడుల చేసేలా ప్లాన్ చేశారు.
తర్వాతి కథనం