1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Woman constable stops CP Chauhan from entering SSC exam center with mobile

సార్.. ఫోన్‌తో ఎగ్జామ్ సెంటర్‌లోకి వెళ్లకండి.. సీపీని ఆపిన మహిళా కానిస్టేబుల్

Woman constable
Woman constable
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. 
 
ఇంగ్లిష్ పరీక్షకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలలో భాగంగా ఎల్బీనగర్‌లోని పరీక్షా కేంద్రాన్ని డీఎస్ చౌహాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ చౌహాన్ పరీక్షా కేంద్రానికి వెళ్తూ వెళ్తూ చేతిలో ఫోన్ పట్టుకెళ్లారు. 
 
ఈ సమయంలో అక్కడ విధుల్లో వున్న మహిళా కానిస్టేబుల్ సీపీని ఆపారు. సీపీ వద్ద వున్న ఫోన్‌ను ఇవ్వాలని.. పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. 
 
దీంతో సీపీ తన చేతిలోని ఫోన్‌ను అప్పగించారు. అంతేగాకుండా.. మహిళా కానిస్టేబుల్ చిత్తశుద్ధి, ఆమె విధుల పట్ల అంకితభావాన్ని గుర్తించి, సీపీ చౌహాన్ ఆమెను సత్కరించారు. 
తర్వాతి కథనం
కోడికూర కోసం తండ్రీకొడుకుల డిష్యూం డిష్యూం.. కుమారుడు హతం