1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Youtube Star Shanmukh Jaswanth caught in Drunk And Drive, Held

మద్యం మత్తులో యూట్యూబర్ బీభత్సం.. అరెస్టు...

Youtube Star
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం సృష్టించాడు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం.10లో ఓ కారు వేగంగా దూసుకొచ్చి రెండు కార్లు, మరో బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ బైకర్ కు తీవ్ర గాయాలయ్యాయి. 
 
కాగా, ప్రమాదానికి కారణమైన కారును నడుపుతున్నది ప్రముఖ తెలుగు యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ అని గుర్తించారు. డ్రైవింగ్ సమయంలో షణ్ముఖ్ మద్యం సేవించినట్టు వెల్లడైంది. బ్రీత్ అనలైజర్ రీడింగ్ లో 170 పాయింట్లు చూపించినట్టు తెలిసింది. 
 
కాగా, ఈ ప్రమాదానికి కార‌ణ‌మైన యూట్యూబ్ ఫేమ్‌, టిక్‌టాక్ స్టార్ ష‌ణ్ముఖ్‌ జ‌శ్వంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు... కారును సీజ్ చేసి..  జశ్వంత్‌ను అరెస్టు చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నేటి నుంచి తెలంగాణాలో అతిపెద్ద జాతర