సంబంధిత వార్తలు
- జగన్ సొల్లు కామెంట్స్ ... బీజేపీకి మెజార్టీ ఉందన్న పొగరు : టీజీ ఫైర్
- పునీత్ రాజ్ కుమార్ను విజయ్ దేవరకొండ ఎందుకు కలిశాడు?
- హీరోయిన్ శ్రుతి అరెస్ట్.. అవకాశాల్లేకపోవడం వల్లే అలా చేసిందట.. ఏం చేసింది?
- ''అజ్ఞాతవాసి''లో పవన్- వెంకటేష్ స్టిల్స్ రిలీజ్.. సోషల్ మీడియాలో వైరల్
- పవన్ కళ్యాణ్ తిక్కకు లెక్కుందంటున్న వెంకటేష్ (వీడియో)
వెంకీకి ఆ హీరోయిన్ కూడా నో చెప్పేసింది... తమన్నా, కాజల్ ఇప్పటికే...
విక్టరీ వెంకటేష్ వృద్ధతరం తారల్లోకి వెళ్లిపోయినట్లేనని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే వెంకటేష్ ప్రక్కన నటించేందుకు టాలీవుడ్ హీరోయిన్లు సుముఖం వ్యక్తం చేయడంలేదు. దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో విక్టర్ వెంకటేష్ హీరోగా నటి
విక్టరీ వెంకటేష్ వృద్ధతరం తారల్లోకి వెళ్లిపోయినట్లేనని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే వెంకటేష్ ప్రక్కన నటించేందుకు టాలీవుడ్ హీరోయిన్లు సుముఖం వ్యక్తం చేయడంలేదు. దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో విక్టర్ వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు.
ఆయన సరసన హీరోయిన్‌గా బుక్ చేసేందుకు తేజ ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్ ను అడుగ్గా వాళ్లిద్దరూ నో చెప్పేశారట. అంతపెద్ద వృద్ధ హీరోతో తాము ఎలా చేస్తామంటూ ప్రశ్నించారట. ఈ నేపధ్యంలో అదితీరావ్ హైదరీని సంప్రదిస్తే చివరికి ఆమె కూడా అబ్బే... వెంకీతో తను చేయలేనని తేల్చేసిందట. మరి వెంకీకి కరెక్ట్ జోడీ ఎప్పుడు దొరుకుతుందో వెయిట్ అండ్ సీ.
