మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (12:04 IST)

పునీత్ రాజ్ కుమార్‌ను విజయ్ దేవరకొండ ఎందుకు కలిశాడు?

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌ను కలిశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పునీత్ రాజ్ కుమార్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవర కొండ పునీత్ రాజ్

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌ను కలిశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పునీత్ రాజ్ కుమార్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవర కొండ పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను కలుసుకున్నారట. 
 
సూపర్ టాలెంటెడ్ విజయ్ దేవర కొండను కలుసుకున్నానని పునీత్ స్పందిస్తే.. పునీత్ బ్రదర్ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా వుందంటూ విజయ్ దేవరకొండ స్పందించాడు. 
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన నటిస్తోంది. ఇకపోతే.. విజయ్ దేవరకొండ, పునీత్ రాజ్ కుమార్ ఎందుకు కలుసుకున్నారోనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 
 
అయితే కన్నడ సినీ పరిశ్రమలోనూ తన సత్తా చాటేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమయ్యాడు. పునీత్ రాజ్ కుమార్‌, అర్జున్ కాంబోలో నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ కొత్త సినిమా నిర్మిస్తున్నాడని.. ఇందులో భాగంగానే ఈ ముగ్గురు కలిశారని టాక్ వస్తోంది.