మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (17:15 IST)

సన్నీలియోన్ వస్తే సామూహిక ఆత్మహత్యలే.. ఎందుకు?

బెంగళూరులో జరిగే కొత్త సంవత్సర వేడుకలు వివాదానికి దారితీశాయి. కొత్త సంవత్సర వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శనలు, వేడుకలకు అంతా సిద్ధమవుతున్న తరుణంలో... అలాంటి ఓ కార్యక్రమంలో పోర్న్ కమ్ బాలీవుడ్ తార సన్నీలియ

బెంగళూరులో జరిగే కొత్త సంవత్సర వేడుకలు వివాదానికి దారితీశాయి. కొత్త సంవత్సర వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శనలు, వేడుకలకు అంతా సిద్ధమవుతున్న తరుణంలో... అలాంటి ఓ కార్యక్రమంలో పోర్న్ కమ్ బాలీవుడ్ తార సన్నీలియోన్ హాజరుకానుందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న క‌ర్ణాట‌క ర‌క్ష‌ణ వేదిక యువ‌సేన నిర‌స‌న‌లు మొద‌లుపెట్టింది. 
 
సన్నీలియోన్ వంటి వారిని ప్రోత్సహించడం కర్ణాటక సంస్కృతికి భంగమని యువసేన అంటోంది. సన్నీ ఇలాంటి కార్యక్రమాల్లో హాజరు కాకూడదని.. ఒకవేళ ఆమె రావడానికి ప్రయత్నిస్తే సామూహిక ఆత్మహత్యలకు కూడా సిద్ధపడతామని బెదిరించారు. 
 
ఇందులో భాగంగా కర్ణాటకలో పలు జిల్లా కేంద్రాలు భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. యువసేన సభ్యులు సన్నీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి.. ఆమె పోస్టర్లు, ఫోటోలు దగ్ధం చేశారు. అయితే ఈవెంట్ నిర్వాహకులు మాత్రం సన్నీ రాకను వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం సబబు కాదంటున్నారు.