మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డివి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (16:37 IST)

అందాలు ఆర‌బోస్తున్న అక్ష‌త‌.. గోవాలో బికినీ షో.. కలిసొస్తుందా?

Akshata Sonawane
తెలుగులో గ‌త ఏడాది `ప్ర‌త్య‌ర్థి` సినిమాలో న‌టించిన అక్షత సోనావానే తాజాగా త‌న స్నేహితుల‌తో క‌లిసి గోవా వెళ్ళి బాగా ఎంజాయ్ చేసింది. త‌మిళ‌, తెలుగు చిత్రాల‌లో న‌టించిన ఈమె కెరీర్ కాస్త మంద‌గించింది. అందుకే కాబోలు ఈ మ‌ధ్య చాలా మంది హీరోయిన్లు బీచ్ అందాలంటూ ఆర‌బోస్తున్నారు. కానీ కొంద‌రు ఒక‌టి రెండు సినిమాలు చేయ‌గానే కెరీర్తో పైకి వెళ్ళిపోతున్నారు.
 
ఏదైనా ఫంక్ష‌న్ల‌లో త‌ళుక్కుమ‌ని మెరుస్తుంటారు. ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది నార్త్ ముద్దుగుమ్మ అక్షత సోనావానే. వివరాల్లోకి వెళితే టి మహిపాల్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న పోస్టర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అక్షత సోనావానే ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే టాలీవుడ్‌లో మూడు సినిమాలకు సైన్ చేసింది. ఆ మూడింటిలో రెండు సినిమాలు ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా వున్నాయి. 
 
వరుస సినిమాలు సైన్ చేయడంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా అక్షత సోనావానే పేరు మారుమ్రోగింది. అటుపై తమిళంలో రెండు సినిమాలు కూడా వచ్చి అమ్మడి ఖాతాలో పడ్డాయి.  తాజాగా తన స్నేహితుల‌తో కలసి గోవా వెళ్లిన అక్షత అక్కడ బికినీ ధరించి తనలో దాగిన అందాలను చూపించి చూపించకుండా చూపిస్తూ కుర్రకారు మతులు పొగుడుతుంది.
Akshata Sonawane


ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఇండస్ట్రీ మరో సూపర్ గ్లామరస్ భామ దొరికింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు అయితే నీ అందాల వేడికి గోవాలో చల్లదనం కూడా వేడిగా తయారయి ఉంటుంది కదా అంటూ కామెంట్స్ పెడుతుండటం విశేషం.   
 
అయితే సినీ జనాలు మాత్రం నార్త్ ముద్దుగుమ్మలకు కెరియర్ బిగినింగ్ లో వరుస అవకాశాలు దక్కడం చాలా అరుదు, ఆ విషయంలో అక్షత గ్రేట్ అంటున్నారు, కానీ అమ్మడు బికినీ ట్రీట్మెంట్ ఈ టైం లో అంత మంచిది కాదు అంటూ సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా గ‌త ఏడాది ప్ర‌త్య‌ర్థి సినిమాకు ఇప్ప‌డు స్టిల్‌కు చాలా తేడా క‌న్పిస్తుంది అమ్మ‌డులో.  మ‌రి దీనిని చూసి ఎవ‌రైనా అవ‌కాశాలు ఇస్తారేమో చూడాలిమ‌రి.