మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (11:18 IST)

శ్రీవారి మాడ వీధుల్లో పందుల సంచారం...

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైవున్న తిరుమల గిరుల్లో ముఖ్యంగా శ్రీవారి మాడ వీధుల్లో పందుల సంచారం పెరిగిపోయింది. ఈ మాడ వీధుల్లో పందుల గుంపు దర్జాగా సంచరిస్తూ వెళ్లిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు 11 పందులు గొల్ల మండపం నుంచి మాఢ వీధుల్లోకి ప్రవేశించాయి. ఆపై తమ కిష్టం వచ్చినట్టుగా తిరుగాడాయి. 
 
వీటిని గమనించిన విజిలెన్స్, ఫారెస్ట్ అధికారులు వాటిని తరిమేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. అవి వెళ్లిపోయిన తర్వాత, మాడ వీధుల్లోకి పందులు వస్తున్న మార్గాన్ని గుర్తించి, అక్కడ ఇనుప కంచెలను వేశారు.  
 
స్వామి ఆలయం అటవీ ప్రాంతం కావడంతో ఇలా పందులు రావడం సహజమేనని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం భక్తుల మనోభావాలను కాపాడటంలో టీటీడీ బోర్డు విఫలమవుతోందని ఆరోపిస్తున్నారు. వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవత్రమైన తిరుమల గిరుల్లో అధికారుల అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి పరిణామాలు భక్తుల మనోభావాలతో ఆడుకోవడమేనని పలువురు ఆరోపిస్తున్నార.