గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 7 జనవరి 2021 (22:13 IST)

తిరుమలలో సతీసమేతంగా హీరో నితిన్, నూతన జంటను చూసి ఎగబడిన జనం

వివాహమైన తరువాత ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్సనలో ఉన్నారు హీరో నితిన్. భార్య షాలిని కందుకూరితో కలిసి ఆలయాలకు తిరుగుతున్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. నితిన్, తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన నితిన్ ఉదయం విఐపి దర్సనంలో స్వామిసేవలో పాల్గొన్నారు.
 
హీరో నితిన్‌తో పాటు కొత్త జంటను చూసేందుకు జనం క్యూలైన్లో ఎగబడ్డారు. అలాగే ఆలయం బయట కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. సున్నితంగా నితిన్ భక్తులను తిరస్కరిస్తూ రెండు చేతులతో వినమ్రంగా నమస్కరించారు. 
 
అలాగే తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు సాయికుమార్ కూడా దర్సించుకున్నారు. 60 యేళ్లు తనకు కావస్తోందని.. త్వరలోనే షష్టి పూర్తి చేసుకుంటున్నట్లు సాయికుమార్ చెప్పారు. మరికొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తానన్నారు సాయికుమార్. అయితే కోవిడ్ పైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు.