శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (11:30 IST)

భార్యను చంపి.. మూటగట్టి పడేసిన కసాయి భర్త!

హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌‌బీ పరిధి, ఎస్ఎస్ కాలనీలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భర్త కసాయిగా మారిపోయాడు. భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గోనె సంచిలో మూటగట్టి పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేపీహెచ్‌బీ ప‌రిధిలోని ఎస్ఎస్ కాల‌నీకి చెందిన శేఖర్ - స్ర‌వంతి అనే దంపతులు ఉన్నారు. వీరిద్దరి మధ్య త‌రుచూ గొడవలు జరుగుతూ వుండేవి. ఈ క్రమంలో భార్యను చంపేసిన భర్త... మృత‌దేహాన్ని మూట‌క‌ట్టి భ‌వనం ప‌క్క‌న ఉన్న ప్ర‌దేశంలో వ‌దిలి పారిపోయాడు.
 
ఆమె మృత‌దేహం కుళ్లిపోయి స్థానికుల‌కు దుర్వాసన రావ‌డంతో వారికి అనుమానం వచ్చి, పోలీసు‎లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.