మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (11:36 IST)

ఇంటికి లేటుగా వస్తున్నాడని.. వేడి వేడి నూనెను ముఖంపై పోసిన భార్య

Heat oil
మహిళలపై అకృత్యాలు ఇంటా బయటా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ఇంటికి లేటుగా వస్తున్నాడనే కోపంతో భర్త ముఖంపై వేడి వేడి నూనె పోసింది భార్య. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, సాగర్ జిల్లాకు చెందిన శివకుమారి అహివార్‌ అనే మహిళకు అరవింద్‌ అహివార్‌ అనే వ్యక్తితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. 
 
రోజూ వారి కూలీ  పని చేసుకునే అరవింద్‌ ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా వస్తుండటంతో భార్యతో గొడవలయ్యేవి. పెద్దలు కల్పించుకుని ఇద్దరికీ సర్ధిచెప్పారు. దీంతో కొద్దికాలం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి కావు. కానీ సోమవారం ఉదయం భర్త నిద్రలో వుండగా శివకుమారి అతడి ముఖంపై వేడి వేడి నూనె పోసింది. 
 
బాధకు తాళలేక బాధితుడి అరుపులు విని అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అతడి ముఖంపై తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివకుమారిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.