1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Mohan Babu Tirumala Darshan

సినిమాల్లో మా సత్తా చూపిస్తాం: మోహన్ బాబు

Mohan Babu
సినిమాల్లో మళ్ళీ తమ కుటుంబం సత్తా చూపిస్తుందంటున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు. తిరుమల శ్రీవారి కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు. ఆలయం వెలుపల మోహన్ బాబుతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు.
 
ఈ సంధర్బంగా మోహన్ బాబు మాట్లాడుతూ, గడిచిపోయిన కరోనా రోజులు మళ్లీ రాకూడదని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు చెప్పారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు మోహన్ బాబు. సన్ ఆఫ్ ఇండియా అనే నూతన సినిమాలో తాను నటించానని.. త్వరలోనే సినిమా విడుదలవుతుందన్నారు.
తర్వాతి కథనం
జనవరి 29న వస్తోన్న '30 రోజుల్లో ప్రేమించటం ఎలా'