ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 24 డిశెంబరు 2020 (22:24 IST)

నేను సామాన్య భక్తుడిని, క్యూలైన్‌లో నిలబడి టోకెన్ పొందిన తిరుపతి ఎమ్మెల్యే

ఆయన ప్రజాప్రతినిధి. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ప్రముఖుడు. ఎక్కడికైనా వెళ్ళే ప్రోటోకాల్ ఉంటుంది. కానీ సాధారణ భక్తుడిలాగా కౌంటర్ లోకి వచ్చారు. టోకెన్‌ను పొందారు. తిరుమల శ్రీవారిని సామాన్య భక్తుడిలా ఈనెల 27వ తేదీ దర్శించుకోబోతున్నారు. ఆయనెవరో కాదు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.
 
వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లను టిటిడి విడుదల చేసిన నేపథ్యంలో టోకెన్ కేంద్రాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే స్వయంగా వచ్చారు. ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 టోకెన్ కేంద్రాలను పరిశీలించారు. క్యూలైన్లో భక్తులకు శానిటైజర్ ఇవ్వడం.. దాంతో పాటు సామాజిక దూరాన్ని పాటించడం చెప్పడం గమనించారు.
 
టిటిడి చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, క్యూలైన్ నుంచి తన ఆధార్ కార్డు చూపించి ఈనెల 27వ తేదీ దర్సనానికి సంబంధించిన టోకెన్‌ను కూడా పొందారు తిరుపతి ఎమ్మెల్యే. ఆ టోకెన్‌ను చూపించిన ఎమ్మెల్యే తను సాధారణ భక్తుడిలాగే తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వాదశి రోజు దర్సించుకుంటానని చెప్పారు.