అన్నీ రోజులూ ఒకేలా వుండవు.. కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ
తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో యాంకర్ అనసూయ ఒకరు. ఈ హాట్ యాంకర్ తాజాగా అమెరికా వెళ్లింది.. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అనసూయ యాంకరింగ్‌ను ఆపేసి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది.
విమానం సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించింది. ప్రస్తుతం పుష్ప2లో నటిస్తోంది. తాజాగా అనసూయ మరోసారి ట్రోలింగ్‌కు గురి అవుతున్నారు. ఈసారి ఆమె ప్రమేయం లేకుండానే.. నెటిజన్స్‌ను ఆమెను వెల్క్కమ్ బ్యాక్ అంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ తనపై వచ్చే విమర్శలు ఏమాత్రం పట్టించుకోకుండా తన లైఫ్ స్టైల్లో తాను హ్యాపీగా గడిపేస్తున్న అనసూయ.. తాజాగా భావోద్వేగానికి గురైంది.
ఏమైందో తెలియదు కానీ.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. బోరున ఏడుస్తూ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అన్నీ రోజులూ ఒకేలా వుండవని.. ఇతరులతో దయతో వుండండి అంటూ ఏడ్చేసింది. ఈ వీడియోను ఐదు రోజుల క్రితం రికార్డు చేసిన యాంకర్ అనసూయ.. ప్రస్తుతం ఇన్ స్టాలో పోస్టు చేసింది.