శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (15:56 IST)

పెద్దపులి చెవి పట్టి మెలేసిన గిబ్బన్ కోతి.. గిచ్చుతూ గిల్లుతూ(Video)

tiger
సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్‌లో అయితే ప్రకృతికి సంబంధించినవి అలాగే మృగాలకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. పెద్దపులులు వున్న చోట ఇతర మృగాలు వుండేందుకు జడుసుకుంటాయి. 
 
అలాంటిది పెద్ద పులులను ఓ గిబ్బన్ కోతి ఆట పట్టించింది. ఆట పట్టించడమేకాదు. వాటికి చెమటలు కూడా పట్టించింది. పెద్ద పులులున్న చోట గిబ్బన్ కోతి వాటి చెవులు పట్టుకుంటూ.. చెట్లకు వేలాడుతూ.. పెద్దపులులకు ఎక్కడా చిక్కకుండా చుక్కలు చూపించింది. 
 
పెద్దపులులను గిచ్చుతూ గిల్లుతూ వాటి తోక పట్టుకుని.. చెవులు పట్టుకుని ఆపై వాటికి చిక్కకుండా, దొరక్కుండా ఆ గిబ్బన్ కోతి చేసిన సాహసానికి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఆ కోతిని పట్టుకునేందుకు పులులు ఎంత ప్రయత్నించినా ఆ గిబ్బన్ కోతి చిక్కలేదు. ఈ వీడియో పాతదే అయినా ప్రస్తుతం NATURE IS AMAZING ట్విట్టర్ అకౌంట్లో Gibbons like to live dangerously పేరుతో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.