గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (14:14 IST)

అలాంటి మహిళలకు కోటిదండాలు చెప్పిన జర్నలిస్టు.. ఎక్కడో తెలుసా?

saitan poster
saitan poster
సినిమాలకు వెబ్ సిరీస్ తేడా ఉంది. నెట్ ఫ్లిక్, అమెజాన్  వంటి.. ఓ.టి.టి.ల్లో కథలు, ఇల్లీగల్ వవ్యహారాలు చూపిస్తున్నారు. దానికి సెన్సార్ ఉండాలని కొందరు అంటే, అది ఉంటె వెబ్ సిరీస్ ఎందుకు అవుతుంది అని డైరెక్టర్ మహి వి రాఘవ్ అంటున్నారు. ఆయన తీసిన సైతాన్ లో హింస, సెక్స్ , బూతు మాటలు మెండుగా ఉన్నాయి. విశేషం ఏమంటే ఈ వెబ్ సిరీస్ ను హైదరాబాద్ లో ప్రివ్యూ వేశారు. యూత్ మహిళలు వచ్చారు.

వారు సినిమా అయ్యాక మాకు ఇందులో  ఉమెన్ ఎంపోర్మెంట్ కనిపించిందని మీడియా ముందు చెప్పారు. ఈ  వెబ్ సిరీస్ లో మహిళలలో స్వేచ్ఛగా ఉండే మరో కోణం సన్నివేశాలు  చాలా ఉన్నాయి.  ఇలా చెప్ప్పిన కొందరి మహిళలకు ఓ జర్నలిస్ట్ కాళ్లకు నమస్కారం పెట్టి. ఇందులో  ఉమెన్ ఎంపోరిమెంట్ ఉందని గ్రహించినందుకు కోటి దండాలు అనడం హైలెట్. 
 
దీని గురించి  డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ...సైతాన్ వెబ్ సీరీస్ సేవ్ ది టైగర్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ విజయం సాధించింది. ఈ విజయం మేము ఊహించలేదు. ప్రతి ఆర్టిస్ట్ , టెక్నీషియన్ ఈ సీరీస్ కోసం కష్టపడి పనిచేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్, డైలాగ్స్, ఆర్ట్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ కు మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. త్వరకో సేవ్ టైగర్స్ కు కొనసాగింపు ఉంటుంది, అలాగే సైతాన్ కు కూడా కొనసాగింపు ఉంటుంది ఆలాగే త్వరలో తాను దర్శకత్వం వహించిన సిద్దా లోకం ఎలా ఉంది నాయనా సినిమా విడుదల కాబోతోందని తెలిపారు.