సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (18:56 IST)

90 బ్యాక్ డ్రాప్ లో అన్నపూర్ణ ఫోటో స్టూడియో : డైరెక్టర్ మారుతి

Maruthi, Chaitanya Rao, Lavanya, chandu
Maruthi, Chaitanya Rao, Lavanya, chandu
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన సినిమా "అన్నపూర్ణ ఫోటో స్టూడియో". మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు.  "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" సినిమా జూలై 21న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర టీజర్ ను స్టార్ డైరెక్టర్ మారుతి విడుదల చేశారు.
 
దర్శకుడు మారుతి మాట్లాడుతూ - ఓ పిట్టకథ సినిమా స్క్రీన్ ప్లే చూసినప్పటి నుంచి చెందు ముద్దు వర్కింగ్ స్టైల్ ఇంప్రెస్ చేసింది. అప్పటి నుంచి తను నాతో ట్రావెల్ అవుతున్నాడు. త్వరలో మా సంస్థలో సినిమా చేయబోతున్నాడు. "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" సినిమాను కూడా చెందు 80, 90 బ్యాక్ డ్రాప్ లో నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా యూనిక్ గా తెరకెక్కించాడు. లావణ్య, చైతన్య ప్రామిసింగ్ గా నటించారు. ఇలా క్రియేటివిటివ్ గా, ప్యాషన్ గా రూపొందించే చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. టీజర్ చూస్తే ఇదొక క్వాలిటీ ఫిల్మ్ అనిపిస్తోంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు. 
 
హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ - మా చిత్ర టీజర్ ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. టీజర్ నుంచి మా "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. మా సినిమాలోని బ్యూటీ చూడబోతున్నారు. కోనసీమ, కేరళలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మా చిత్ర పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. టీజర్ ను హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
 
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ - మా సినిమా పాటలను సూపర్ హిట్ చేశారు. టీజర్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. టీజర్ లోని లొకేషన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. త్వరలో ట్రైలర్ మీ ముందుకు తీసుకొస్తాం. అని చెప్పింది.
 
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ - మా చిత్ర టీజర్ చూసి మారుతి గారు ప్రశంసించారు. నా గత చిత్రంలాగే ఇందులో కూడా సరికొత్త స్క్రీన్ ప్లే చూస్తారు. ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో, అందమైన లొకేషన్స్ తో, ఆకట్టుకునే మ్యూజిక్ తో తెరకెక్కించాను. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. వచ్చిన ఔట్ పుట్ తో సంతోషంగా ఉన్నాం. జూలై 21న సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. తప్పకుండా కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుంది. అన్నారు.