బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 31 మే 2023 (15:48 IST)

హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు : ఆపరేషన్ రావణ్ ఫస్ట్ థ్రిల్ లాంచ్ లో రాధికా

Radhika, tammaredy and others
Radhika, tammaredy and others
‘పలాస 1978’ హీరో రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం “ఆపరేషన్ రావణ్”. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్ యాక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ ఆపరేషన్ రావణ్ లో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి 'ఫస్ట్ థ్రిల్'ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మారుతి, కళ్యాణ్‌ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. " ఓ తండ్రి కొడుకును పెట్టి డైరెక్ట్ చేయడం అరుదుగా జరుగుతుంది. కథను మాత్రమే నమ్మి సినిమా తీసినట్టు అనిపించింది. అసలు తండ్రి కొడుకుతో ఇలాంటి సినిమా తీయాలన్న ఆలోచనే గొప్పగా ఉంది. మీ ఆలోచనలే మీ శతృవులు అనే క్యాప్షన్ కూడా బావుంది. ఈ ఫస్ట్ థ్రిల్ బావుంది. రక్షిత్ తో పాటు ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్.. ". అన్నారు. 
 
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. " రక్షిత్ అంతకు ముందు రెండు సినిమాలు చేశాడు. పలాసలో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ప్రసాద్ గారు డైరెక్షన్ చేస్తా అన్నప్పుడు నవ్వుకున్నా. బట్ ఇప్పుడు ట్రైలర్ చూశాక చాలా బావుంది. అద్భుతంగా ఉంది. రాధిక గారు ఒప్పుకున్నారు అంటే దర్శకుడిలో విషయం ఉందనుకున్నాను. మంచి తండ్రి, మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు, నిర్మాత ప్రసాద్. వెంకట్ సత్య అనే పేరుతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. రక్షిత్, ప్రసాద్ ను అభినందిస్తూ.. ఈ ఫస్ట్ థ్రిల్ చాలా బావుంది. నాకు కథ కూడా తెలుసు. ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.. " అన్నారు.
 
నటి రాధిక మాట్లాడుతూ, నేను పలాస చూశాను. కానీ మరోసారి చూశాను. ఇక ఈ మూవీ షూటింగ్ లో కూర్చున్నప్పుడు నాకు ఆ ఫిల్మ్ బాగా నచ్చింది. పలాస రైటింగ్ ఎవరూ అంటే నేనే అన్నారు. చాలా ఆశ్చర్యపోయాను. ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ చాలా కామ్ గా పనిచేసుకుంటూ వెళ్లారు. కామ్ గా ఉన్నా.. అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. చాలా ఎఫర్ట్ పెట్టారు. నా ఎక్స్ పీరియన్స్ ప్రకారం ఎఫర్ట్ నెవర్ ఫెయిల్స్. హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. ఈ పిక్చర్ లో ఉన్న అందరు ఆర్టిస్టులు, హీరోయిన్, మాస్క్ విలన్ అంతా బాగా చేశారు. వాళ్లంతా సీజన్డ్ ఆర్టిస్టులు. వాళ్ల టాలెంట్ బయటకు తీసుకు రావడమే దర్శకుడి పని. నాకు ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్ చేయాలనే కోరుకుంటాను. ఇలాంటి తెలుగు సినిమాలు వస్తే డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని మరీ చేస్తాను. రక్షిత్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియర్ పర్సన్. అతని కళ్లు చాలా బావుంటాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఆపరేషన్ రావణ్ హిట్ కావాలి.. థ్యాంక్యూ.." అన్నారు. 
 
హీరో రక్షిత్ మాట్లాడుతూ.. " అందరికీ నమస్కారం.. ఇక్కడికి వచ్చిన మారుతి గారు, భరద్వాజ గారికి, కళ్యాణ్‌ కృష్ణ గారికి థ్యాంక్యూ. ఈ మూవీ టెక్నీషియన్స్ గురించి తర్వాత ఈవెంట్స్ లోమాట్లాడతాను. మా సినిమా ఫస్ట్ సక్సెస్ రాధిక గారు ఒప్పుకున్నప్పుడే జరిగింది. వెంకట సత్య వర ప్రసాద్ .. మా నాన్నగారు.. నా ప్రాణం.. ఈ చిత్రానికి దర్శకుడు. 1995లో స్వీట్ మ్యాజిక్ స్థాపించారు. అప్పుడు ఏం లేదు. కానీ ఇప్పుడు కొన్ని వేలమందికి ఉద్యోగం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోస్వీట్ మ్యాజిక్ తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆపరేషన్ రావణ్ తీశారు. ఈ మూవీ దేశం అంతా తెలుస్తుందనుకుంటున్నా. ఏదో డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేశారు అని కాకుండా.. అన్ని విషయాలు చాలా క్షుణ్నంగా పరిశీలించి నేర్చుకుని చేశారు. ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందే సెట్స్ లో ఉండేవారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా ఈ కాన్ఫిడెంట్ కు కారణం అదే. పలాస గురించి  ఓ కాలేజ్ ఈవెంట్ లో చెప్పాను. ఈ సినిమా చూడండి.. చూశాక నచ్చకపోతే నా కాలర్ పట్టుకోండి అని. ఇప్పుడు అంతకు మించిన కాన్ఫిడెన్స్ తో చెబుతున్నాను. నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందీ సినిమా. చాలా పెద్ద దర్శకుడు ఎలా హ్యాండిల్ చేస్తారో అలా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ప్రయాణంలో మా తమ్ముడు, మా అమ్మ సపోర్ట్ మరలవలేనిది.. థ్యాంక్యూ.. " అన్నారు.