1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Modified: సోమవారం, 27 మార్చి 2023 (08:28 IST)

రక్షిత్ అట్లూరి హీరోగా పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్

Rakshit Atluri  clapby chandu
రక్షిత్ అట్లూరి  హీరోగా,  గొల్ల పాటి నాగేశ్వరావు  దర్శకత్వంలో విశ్వేశ్వర శర్మ, రాజరాయ్ నిర్మిస్తున్న  పోలీస్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్  చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో  ప్రారంభం అయ్యాయి. ముహూర్త‌పు స‌న్నివేశానికి  కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి  క్లాప్ కొట్టగా  ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 
 
పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర  దర్శకుడు  గొల్ల పాటి నాగేశ్వరావు   మాట్లాడుతూ...ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సస్పెన్సు యాక్షన్ డ్రామా, పోలీస్  నేపథ్యం లో  ఈ సినిమా ఉండబోతోంది. ఏప్రిల్ 15 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
 
హీరో రక్షిత్  మాట్లాడుతూ... డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను. ఒక మంచి  టీమ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.
 
ప్రొడ్యూసర్ మాట్లాడుతు విశ్వేశ్వర శర్మ శర్మ మాట్లాడుతూ మా డైరెక్టర్ గారు ఒక కొత్త కాన్సెప్ట్ తో సరి కొత్త కధాంశం తో  చిత్రాన్ని నిర్మిస్తామని ఒక మంచి సినిమా స్టోరీ  చాల బాగుంది. త్వరలో మిగతా నటీనటులు వివరాలు మరియు సాంకేతిక నిపుణల వివరాలు తెలియియజేస్తాను అని చెప్పారు .  ఈ కార్యక్రమంలో యు అండ్ ఐ అధినేత పద్మనాభ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు .