1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Jr NTR wishes wife Lakshmi Pranath on her birthday in the most adorable way; See here

హ్యాపీ బర్త్ డే అమ్మలు - లక్ష్మీ ప్రణతికి జూనియర్ ఎన్టీఆర్ క్యూట్ విషెస్

jr ntr couples
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఆదివారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని తన భార్యకు హీరో యంగ్ టైగర్ క్యూట్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే అమ్మలు అంటూ తన ఇన్‌స్టా వేదికగా విషెస్ చెప్పారు. 
 
ఎన్టీఆర్ అలా పోస్ట్ చేయగానే అలా కామెంట్ల వర్షం కురుస్తుంది. హ్యాపీ బర్త్ డే వదిన అంటూ ఆదివారం ఉదయం నుంచి నందమూరి ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. 9 లక్షలమందికి పైగా లైక్ చేశారు. ఆరు వేల మందికి పైగా కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్‌ తన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నాసరే ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంటారు. తన భార్యతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు.
 
కాగా, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే 30వ చిత్రం ప్రారంభమైంది. ఇందులో దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతంలో కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెల్సిందే.
తర్వాతి కథనం
మీటర్ లో కిరణ్ అబ్బవరం, అతుల్య రవి పై మాస్ సాంగ్