శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (17:13 IST)

ఉపాసనకు అరుదైన గౌరవం- మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ లిస్టులో..!

Upasana, Ramcharan
మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తోంది. కుటుంబ బాధ్యతలతో పాటు సొంత వ్యాపారాన్ని సాగిస్తున్న ఆమె.. రామ్ చరణ్‌తో పెళ్లయిన 13 ఏళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతోంది.
 
ఎప్పటి నుంచో వారసుడి కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యామిలీకి, మెగా అభిమానులకు ఈ వార్త పండుగ లాంటిదే. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ లభించిందని అందరూ సంబరాలు చేసుకుంటుండగా, వేడుకలు రెట్టింపు అయ్యాయి. 
 
ఈ విషయంలో ఉపాసన వల్ల తాను చాలా అదృష్టవంతుడిని అని రామ్ చరణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాజాగా ఉపాసన మెగా ఫ్యామిలీకి మరో గుడ్ న్యూస్ చెప్పింది. అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనవరాలిగా రామ్ చరణ్ భార్య ఉపాసన బిజీ లైఫ్ గడుపుతోంది. 
 
చిరంజీవి కోడలు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్, ఆమె "బీ పాజిటివ్" అనే హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా ఉన్నారు. వైద్య రంగంలో తనదైన రీతిలో సేవలందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన కొణిదెల. 
 
ఎన్నో వైద్య శిబిరాలు, వైద్యసేవలు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల సేవలకు గుర్తింపుగా అరుదైన గౌరవం దక్కింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23 లిస్ట్‌లో ఉపాసన కామినేని కొణిదెల పేరు వచ్చింది.