బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (10:08 IST)

మరోసారి తండ్రి అయిన మార్క్ జుకర్ బర్గ్..

Mark Zuckerberg
Mark Zuckerberg
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తండ్రి అయ్యారు. జుకర్ బర్గ్ అర్ధాంగి ప్రిసిల్లా చాన్ మూడో కుమార్తెకు జన్మనిచ్చింది. మార్క్ జుకర్ కాలేజీ మేట్ అయిన ప్రిసిల్లా చాన్‌ను ప్రేమించి పెళ్లాడారు. వీరి వివాహం 2012లో జరిగింది. 
 
ఈ జంటకు ఇప్పటికే మ్యాక్సిమా, ఆగస్ట్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే మూడోసారి కూడా అమ్మాయే పుడుతుందని జుకర్ బర్గ్ కొన్నినెలల కిందటే ప్రకటించారు.
 
అమెరికాలో లింగనిర్ధారణ పరీక్షలు నేరం కాదు. మరోసారి అమ్మాయి పుట్టడం పట్ల జుకర్ బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తె పేరు అరేలియా చాన్ జుకర్ బర్గ్ తెలిపారు.