ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (21:50 IST)

శ్రీ లక్ష్మీకటాక్షం: ఒకే లాటరీ.. రూ.16కోట్లు గెలిచాడు.. అంతా భార్య అలక వల్లే..! (video)

శ్రీ లక్ష్మీ కటాక్షం అలా వుంటుంది. ఒకేసారి రెండు లాటరీలు తగలడంతో రూ.16కోట్లు గెలుచుకున్నాడు. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు చెందిన ఓ జంట గత 30 ఏళ్లుగా ఒకే నెంబర్ లాటరీ టికెట్ కొంటోంది. అయితే ఆ జంటకు నిరాశ తప్పలేదు. దీంతో తమ అదృష్టం ఇంతే అని సరిపెట్టుకున్నారు. 
 
ఓ రోజు తన పేరు మీద లాటరీ టికెట్ తీసుకోలేదని భార్య కోపంతో రగిలి అలిగింది. దీంతో ఆమె మొహంలో చిరునవ్వును చూడాలన్న కోరికతో ఆమె పేరు మీదే మరుసటి వారం రెండు లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు భర్త. అదృష్టం తలుపు తట్టడంతో ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయ్యారు ఈ దంపతులు. 
 
అయితే గత వారం భార్య తన పేరు మీద లాటరీ తీసుకోవడం మరిచిపోయానని.. దీంతో తన భార్య తనపై అలిగిందని.. తన అలకను తీర్చడానికి తన పేరు మీదే ఈ వారం రెండు టిక్కెట్లను కొన్నానని ఆ భర్త చెప్పాడు. ఒక టికెట్ నెంబరు సెర్చ్ చేయగా వన్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు తెలిసింది. 
 
ఆ తర్వాత రెండో టికెట్ నెంబర్ కూడా చూడగా దానికి లాటరీ తగలిందని ఆ భర్త హర్షం వ్యక్తం చేశాడు. రెండో టికెట్ నెంబర్ కూడా చూడగా దానికి లాటరీ తగలింది. మొత్తంగా రెండు టికెట్లకు కలిపి 2 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ విషయాన్ని భార్యకు చెబితే ఎగిరి గంతులేసిందని వెల్లడించాడు.