బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (15:32 IST)

మొబైల్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌కు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం

smartphone
మొబైల్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌కు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్‌లలో ముందుగా ఇన్ స్టాల్ చేసిన యాప్‎ల ద్వారా ఫ్రాడ్ జరుగుతుందని తెలుస్తోంది. ప్రధానంగా చైనా వంటి దేశాలు ఈ యాప్‌ల ద్వారా దురాక్రమణలకు పాల్పడుతోందనే అనుమానాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
భద్రతకు పెద్ద పీట వేస్తూ మొబైల్‌లో ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను తొలగించే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కొత్తగా ప్రతిపాదిస్తున్న నిబంధనల ప్రకారం ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగించి.. ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్టేట్‌లను తప్పనిసరి చేసేలా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలను ఆదేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే ప్రీ-ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను తొలగిస్తే స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నష్టాలు వాటిల్లే అవకాశాలు మెండుగా వున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం స్మార్ట్ ఫోన్ తయారీదారులు తమ కొత్త మోడళ్లలో అన్ ఇన్ స్టాల్ చేసే విధంగా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.