సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (15:43 IST)

సురేష్ బాబు విడుదల చేసిన అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఫస్ట్ లుక్

suresh babu launch look
suresh babu launch look
పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో అభిరుచిని చాటుకున్న బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’.ఇచ్చట అందమైన ఫోటోలు తీయబడును అనేది ఉపశీర్షిక. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో ఈ మూవీ నుంచి డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కు పరిశ్రమతో పాటు ప్రేక్షకల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుగారి చేతుల మీదుగా విడుదల చేశారు.
 
ఈ సందర్భగా సురేష్ బాబు మాట్లాడుతూ ..  ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ పేరుతో వస్తోన్న ఈ మూవీ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెబుతున్నాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ‘ ఈ చిత్రం 1980స్ బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. దీంతో పాటు కొన్ని ట్విస్ట్ లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సహజమైన నేటివిటీతో ఉండటం వల్ల చాలామందికి వారి పాత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తుంది. గతంలో నేను చేసిన ఓ పిట్టకథ చిత్రం నాకు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రం అంతకు మించిన పేరును తెస్తుందని ఆశిస్తున్నాను. టెక్నీకల్ గా ఈ మూవీ నుంచి ది బెస్ట్ అవుట్ పుట్ ఉంటుంది. డివోపి పంకజ్, మ్యూజిక్ ప్రిన్స హెన్రీ, ఎడిటర్ వెంకట్ అంతా యంగ్ టీమ్  సినిమా పూర్తయి.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఫైనల్ కాపీ చూసిన తర్వాత నాతో పాటు నిర్మాతగారు కూడా చాలా హ్యాపీగానూ, కాన్ఫిడెంట్ గానూ ఫీలవుతున్నాము. త్వరలోనే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయబోతున్నాం. లిరికల్ రిలీజ్ లు, టీజర్, ట్రైలర్ ఇవన్నీ చూస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా ఇదో స్పెషల్ మూవీ అని అర్థం అవుతుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో కూడా మంచి నేటివిటీతో కూడిన ఫీల్ ఉన్న సినిమాగా అందరికీ గుర్తుంటుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత యష్ రంగినేని గారికి మరోసారి థ్యాంక్స్ చెబుతున్నాను..’ అన్నారు.
 
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. 1980స్ బ్యాక్ డ్రాప్ కావడంతో అందుకు తగ్గట్టుగానే, మంచి మంచి లొకేషన్స్ లో బ్యూటీఫుల్ విజువల్స్ తో పాటు మమ్మల్ని కూడా అందంగా చూపించిన డివోపి గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ పాటలు ప్రతి ఒక్కరినీ మెప్పిస్తాయి. త్వరలోనే రిలీజ్ కాబోతోన్న లిరికల్స్ సాంగ్స్ తో అంచనాలు పెరుగుతాయి. కంటెంట్ పరంగా కథ ప్రధానంగా ఏడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. మంచి లవ్ స్టోరీతో పాటు ఫన్, సస్పెన్స్, థ్రిల్ తో పాటు మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూసిన ప్రతి ఒక్కరికీ మంచి ఫీల్ ను ఇస్తుందని చెప్పగలను’ అన్నారు.