1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (18:45 IST)

కింగ్ ఆఫ్ కోథా నుంచి దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ లుక్

Dulquer Salmaan's character look
Dulquer Salmaan's character look
జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ ' కింగ్ ఆఫ్ కోథా' మరో ఎక్సయిటింగ్ మాస్ ఎంటర్‌టైనర్ అవుతుందని భరోసా ఇచ్చింది. లక్షలాది అభిమానుల ఉత్సాహాన్ని ఇస్తూ ఎడ్జీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్  వీడియోను మేకర్స్  విడుదల చేసారు. క్యారెక్టర్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాలోని కీలక పాత్రలను ఇంట్రస్టింగ్ స్కెచ్ ఫార్మాట్‌లో పరిచయం చేస్తుంది. దుల్కర్ సల్మాన్ 'కింగ్' పాత్రలో రిఫ్రెష్‌గా ఇంటెన్సివ్‌గా తనదైన ముద్రవేశారు.
 
ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ తో పాటు  డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ వంటి ప్రముఖ తారాగణం ఉంది.
 
ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం ఓనం పండుగ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, షాన్ రెహమాన్,  జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు.
 
జూన్ 28న టీజర్‌ను మేకర్స్ విడుదల చేయనున్నారు.
 
జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం యూనిక్ కంటెంట్, ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించనుంది.