డుల్కన్ తో డాన్స్ చేయడం ఇష్టమన్న మాళవిక నాయర్
Malavika Nair with Dulkan
Malavika Nair with Dulkan
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, వైజయంతి మా ఫ్యామిలీ లాంటి సంస్థ. వీరితో అవకాశం వస్తే వదులుకోను. రాజేంద్రప్రసాద్‌గారికి నేను ఫ్యాన్ ను. మహానటిలో మీ నటనకు అభిమాని ని. నాని దసరా తో హిట్ కొట్టాడు. సంతోష్ ఇందులో చాలా చార్మింగ్ గా వున్నావు. కామెడీ టైమింగ్ బాగుంది. ఆల్ ది బెస్ట్ అన్నారు.
నాని మాట్లాడుతూ, స్వప్న, నాగి, స్వీటీ వీరంతా నా ఫ్యామిలీ. ఈ సినిమా దర్శకురాలు నందినీ గారు స్పెషల్ మూవీ చేసింది. ఈ సినిమా ట్రైలర్ లడ్డూలా వుంది. అన్ని శాఖలు బాగా కుదిరాయి. మాళవిక నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం కు మంచి పేరు వచ్చింది. తను మంచి పెర్ఫార్మర్. గొప్ప నటి. సంతోష్ లో చాలా ఈజ్ వుంది. కామెడీ టైమింగ్ వుంది. నందినికి మరో నాని సంతోష్ రూపంలో దొరికాడు. ఈ టైటిల్ విన్నప్పుడు చాలా పెద్దగా వుందే అనిపించింది. అలాంటిది స్వప్న ఈ సినిమా టైటిల్ ను జనాల్లోకి రీచ్ అయ్యేలా కృషి చేశారు. అందరికీ గుర్తుండేలా ఈ సినిమా స్పెషల్ మూవీ అవుతుంది. మే 18న మార్నింగ్ షోకు వస్తున్నాను. మీరూ రండి. రిలీజ్ కు ముందు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి అని అన్నారు.

