నేను చెన్నైలో వుంటే వెదికి పట్టుకొని ఈ సినిమా చేయించారు: గౌతమి
నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. ఇందులో గౌతమి నటించారు. ఆమె మాట్లాడుడూ, నేను ఎప్పుడూ జెండర్ ని బట్టి ప్రతిభ, సామర్థ్యాన్ని జడ్జ్ చేయను. ఒక లక్ష్యం వుంటే దాని కోసం ఎవరైనా ప్రయత్నించాల్సిందే. ఈ విషయంలో అయితే అద్భుతమైన ప్రొడ్యూసర్, అద్భుతమైన డైరెక్టర్. నందిని రెడ్డి గోల్డెన్ హార్ట్ డైరెక్టర్. తను ఎప్పుడూ ప్రశాంతంగా వుంటుంది. స్వయం నియంత్రణ వున్న దర్శకురాలు.
స్వప్నగారు విషయానికి వస్తే ఒక గొప్ప నిర్మాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో కనిపించాయి. నేను ఎక్కడో చెన్నైలో వుంటే వెదికి పట్టుకొని మరి కథని ఆ పాత్రని చెప్పించారు. ఒక దర్శకుడి విజన్ కి తగ్గట్టు పని చేసి, వారికి ఏం సమకూర్చాలో తెలిసిన నిర్మాత. ప్రియాంక, స్వప్న ఇద్దరూ వండర్ ఫుల్ ప్రోడ్యుసర్స్. ఈ విషయంలో అశ్వినీదత్ గారికి నిజంగా హ్యాట్సప్. ఇద్దరు పిల్లల్ని ఎంతో చక్కగా ప్రోత్సహించి ఇంత గొప్ప స్థితికి తీసుకొచ్చారు.
- సినిమా చూసినప్పుడు ప్రేక్షకుల మనసులో ఒక హాయి వుంటుంది. వెన్నెల కిషోర్ టైమింగ్ చాలా బావుంటుంది. అలాగే ఈ సినిమాలో అందరూ కూడా మంచి టైమింగ్ వున్న నటులే. ఇంత మంచి టాలెంట్ తో పని చేసినప్పుడు మన స్థానం మనం నిలబెట్టుకోవాలంటే చాలా ఎలర్ట్ గా వుండాలి. అది ఎక్సయిటింగా అనిపించింది.
- నేను వర్క్ హాలిక్. ఏదో పని ఉండాల్సిందే. ఇన్నాళ్ల తర్వాత కూడా ఇలాంటి మంచి పాత్రలు వెతుక్కుంటూ రావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.
- మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది. తనకు కెమెరా వెనుక ఉండటం ఇష్టం.