శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 మే 2023 (14:09 IST)

జాతి రత్నాలుకు మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి

Priyanka Dutt, Swapna
Priyanka Dutt, Swapna
సహజంగా ఇద్దరు అక్కాచెల్లెల్లు వుంటే అభిప్రాయాలు వేరుగా వుంటాయి. అలాంటివి మా మధ్య వున్నాయని నిర్మాతలుగా మారిన అశ్వనీదత్‌ కుమార్తెలు ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌ తెలియజేశారు. జాతి రత్నాలు టైంలో మా ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది.  వాదోపవాదాలు జరిగాయి. ఆ సినిమా చూశాక ఇలాంటి సినిమా చూస్తారా! నాకైతే నచ్చలేదు. ఈ  ఈ విషయాన్ని నాగ్‌ అశ్విన్‌కు చెప్పాను. అప్పుడే ఓటీటీ మంచి రేటుతో ఆఫర్‌ వచ్చింది.

అయినా నాగ్‌ అశ్విన్‌ ఒప్పుకోలేదు. నాకు సినిమాపై నమ్మకం వుంది. ఇది ఆడితే ఆడుతుంది. లేదంటే పోతుంది. అని స్పష్టంగా మాట్లాడారు. జాతిరత్నాలు సినిమాను గత్యంతరం లేక చాలా దైర్యం చేసి విడుదల చేశామని స్వప్నా దత్‌ తన మనసులోని మాటను తెలియజేశారు. ఒకరకంగా చాలా డేర్‌ స్టెప్‌ తీసుకున్నామని అన్నారు.
 
ఆ సినిమా తర్వాత మా ఫేట్‌ మారిపోయింది. నాగ్‌ అశ్విన్‌ ఆలోచనలకు వాల్యూ పెరిగింది. కరోనా టైంలో ఆ టైప్‌ కామెడీకి ఆదరణ పెరిగింది. 2023లో గనుక వస్తే చూస్తారో లేదో కూడా చెప్పలేమని అన్నారు. ఇప్పుడు ప్రభాస్‌తో ప్రాజెక్ట్‌ కె. సినిమా రన్నింగ్‌లో వుంది. వాటి గురించి త్వరలో వివరాలు తెలియజేస్తామని అన్నారు.