శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (17:34 IST)

రాజమండ్రి లో టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ పోస్టర్‌

Tiger Nageswara Rao first look poster
Tiger Nageswara Rao first look poster
మాస్ మహారాజా రవితేజ పాన్ ఇండియన్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. టైగర్ నాగేశ్వరరావు అనే దొంగ నేపత్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇందులో రేణు దేశాయ్ నటిస్తోంది. ఓ కీలక పాత్ర ఆమె పోషిస్తుంది. కాగా, ఈ సినిమా  ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మే 24న గ్రాండ్‌గా ఆవిష్కరించనున్నారు. ఇందుకు ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రి లో ఘనంగా ఫంక్షన్ చేస్తున్నారు. 
 
ఇద్దు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కనుక కన్నడ, మలయాళం పోస్టర్‌లను శివరాజ్‌కుమార్‌, దుల్కర్‌ సల్మాన్‌,  తమిళ పోస్టర్‌ను హీరో కార్తీ  విడుదల చేస్తారని చిత్ర యూనిటీ తెలిపింది. ఇక తెలుగు, హిందీ పోస్టర్లను ఒకరోజు ముందుగా ప్రకటించనున్నారు. ఇందులో నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇంకా అనుపమ్ ఖేర్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు.