1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Every Thing Is Ready For Chiranjeevi Son In Law Grand Entry

ఇక వెండితెరకు చిరంజీవి చిన్నల్లుడు.. స్క్రిప్ట్‌ మెగాస్టార్ ఓకే చేయాలట..

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి అంశాల్లో కల్యాణ్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చెర్రీ మద్దత

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి అంశాల్లో కల్యాణ్ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చెర్రీ మద్దతిస్తున్నాడని.. తాజాగా ఓ కథ కల్యాణ్‌కు నచ్చిందని తెలిసింది. 
 
ఈ కథను ముందుగా దర్శకుడు రాకేశ్ శశి ముందుగా హీరో నిఖిల్‌కు వినిపించారట. అయితే ఈ కథలోని తండ్రీకొడుకుల సెంటిమెంట్ తనకి చాలా బాగా నచ్చిందని చెప్పిన నిఖిల్, తనకి ఈ కథ అంతగా సెట్ కాదని చెప్పాడట.
 
ఆ తర్వాతే కల్యాణ్‌కి ఆ దర్శకుడు కథ వినిపించాడని.. ఆ కథతో చిరంజీవి చిన్నల్లుడు సినిమా తెరంగేట్రం చేస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం 'సైరా' పనుల్లో బిజీగా వున్న చిరంజీవి ఒకసారి ఈ కథ వినేసి ఓకే చెప్పేస్తే, సెట్స్ పైకి వెళ్లడానికి అంతా సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. కాగా 2016, మార్చిలో కల్యాణ్, శ్రీజల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 
About Writer
selvi
తర్వాతి కథనం
కుమ్మేస్తున్న ఎంసీఏ కలెక్షన్లు: ఎనిమిది రోజుల్లో రూ.30కోట్లు?