1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Is Tulabharam coming up as a collaboration between Ravi Teja and Vivek Athreya ?

Raviteja: రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తులాబారం రాబోతుందా ?

Ravi Teja and Vivek Athreya
Ravi Teja and Vivek Athreya
మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లోనే తగిన చిత్రంగా ఇరుముడితో పేరుతెచ్చుకున్న తర్వాత కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇరుముడికి ముందే మూడు సినిమాలను లైన్ లో వున్నాయి. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చిత్రం కమిట్ అయ్యాడు. ఈ చిత్రానికి శిరీష్ లక్మణ్ నిర్మాతలు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈనెల 11వ తేదీన హైదరాబాద్ లోని స్టూడియోలో ప్రారంభంకానున్నదని తెలుస్తోంది.
 
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి 'తులాభారం' అనే పేరును పరిశీలిస్తున్నారు. ఆత్రేయ శైలికి తగ్గట్టుగానే ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఉండబోతోందని అంచనా. అంతకుముందు భర్తమహాశయులకు విజ్నప్తి సినిమా చేసి అభాసుపాలయ్యాడు. 
 
ఇక 'ఇరుముడి' విజయంతో రవితేజ తన కెరీర్‌ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు; వివేక్ ఆత్రేయతో చేయబోయే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఆసక్తికరంగా కనిపిస్తోంది. అలాగే, హసిత్ గోలి దర్శకత్వంలో కూడా ఆయన ఒక సినిమా చేయనున్నారు, ఇందులో శ్రీ విష్ణు కూడా నటించే అవకాశం ఉంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
తెలుగు బిగ్ బాస్ 10- అమన్‌తో త్రిగుణ్ వాగ్వాదం.. రెడ్ కార్డ్ తప్పదా? (video)