1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. kollywood actress vanitha vijayakumar all set to for third marriage

ముగ్గురు పిల్లల తల్లి మూడోపెళ్లి, 40 ఏళ్లకి దగ్గరపడుతున్న నటి వనిత థర్డ్ మ్యారేజ్ నిజమేనా?

kollywood
తెలుగులో దేవి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న వనిత గుర్తుండే వుంటుంది. ఆమెకి ఆ చిత్రం తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఎప్పుడూ వార్తల్లో మాత్రం వుంటూనే వుంటుంది. తమిళ బిగ్ బాస్ షోతో కాస్తంత పాపులరయ్యింది. ఇప్పుడు మళ్లీ మూడో పెళ్లితో వార్తల్లోకి వచ్చేసింది.
 
ఆమె 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకున్నది. కొంతకాలం వీరి కాపురం బాగానే సాగింది. ఈ క్రమంలో వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. కానీ ఆకాశ్‌తో కొన్ని మనస్పర్థల కారణంగా అతడి నుంచి విడిపోయి 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది.
 
ఐతే కొంతకాలానికి అతడికి కూడా విడాకులు ఇచ్చేసింది. మళ్లీ ఇప్పుడు మూడోపెళ్లి వార్తలు వస్తున్నాయి. పలు సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్‌గా పని చేసే పీటర్ పాల్ అనే వ్యక్తిని వనిత పెళ్లాడుతున్నట్లు పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
సుశాంత్.. అవకాశముంటే.. నీ బాధను నేను తీసుకునేదాన్ని!