గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (16:45 IST)

తల్లికి కరోనా.. మాది ఉమ్మడి కుటుంబం.. 45మంది ఉంటారు.. కాపాడండి..

Deepika singh
తన తల్లికి కరోనా పాజిటివ్‌ సోకిందని బుల్లితెర నటి దీపికా సింగ్ వాపోయింది. దియా ఔర్‌ బాటి హమ్‌ సీరియల్‌లో నటిస్తున్న దీపికా సింగ్‌.. తన తల్లికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపింది. ఢిల్లీలో ఉంటున్న ఆమె తల్లితండ్రులకు కోవిడ్‌ చికిత్స అందించాలని ఆ నటి సీఎం కేజ్రీవాల్‌ను కోరింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది. 
 
తమది ఉమ్మడి కుటుంబం అని.. తమ ఇంట్లో 45 మంది ఉంటారని, 55 ఏళ్ల తన తల్లికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఢిల్లీలోని లేడీ హార్డింగే మెడికల్‌ కాలేజీలో పరీక్షలు జరిపారని, కానీ రిపోర్ట్స్‌ ఇవ్వలేదని, తల్లికి కరోనా చికిత్స అందించాలంటూ నటి దీపికా సీఎం కేజ్రీవాల్‌ను కోరింది. తన తల్లి ఎప్పుడూ బయటకు వెళ్లలేదని, కానీ ఆమెకు ఎలా వైరస్‌ సోకిందో అర్థం కాలేదని ఆమె చెప్పింది. 
 
ఇంట్లో ఉన్నవారందరికీ పరీక్షలు చేసి, రక్షించాలని ఆమె వేడుకుంది. ఢిల్లీలోని కరోనా పేషంట్లను ట్రీట్ చేసే ఆస్పత్రులకు ఫోన్ చేసినా బెడ్స్ ఖాళీ లేవంటున్నారని నటి ఆవేదన వ్యక్తం చేసింది తమకు సాయం చేయమంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోదీలను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తన తల్లి చాలా నీరసంగా ఉందని సత్వరం స్పందించమని కోరింది. 
 
దీపిక పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ మేడమ్.. సెలబ్రెటీ అయిన మీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధమవుతోంది. కరోనా వచ్చిన సామాన్యుడు బ్రతుకు మీద ఆశ వదులుకోవాల్సిందేనేమో అని అంటున్నారు.