సంబంధిత వార్తలు
- టాలీవుడ్ హీరో వివాహం నిరవధికంగా వాయిదా
- యాంకర్ సుమకు అలాంటి మెసేజ్ లు వస్తుంటాయన్న రాజీవ్ కనకాల, వీడియో వైరల్
- ఫోనుకు మూడు ముళ్లు వేసిన వరుడు ... ట్రెండ్ సెట్ చేసిన యూత్.. ఎక్కడ?
- పెళ్లి చేయలేదని కన్నవారిని కాటికి కడతేర్చిన కసాయి కొడుకు.. ఎక్కడ?
- పాక్‌లో మతమార్పిడి.. 14ఏళ్ల మైనార్టీ అమ్మాయికి 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
అన్ని జరిగిపోతున్నాయ్ కదా... త్వరలో చెబుతాం : పెళ్లిపై మలైకా కామెంట్స్
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్ఫాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 19 యేళ్లపాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. ఫలితంగా వీరికి 17 యేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడిపోయారు. అర్ఫాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలోపడింది. ఆ తర్వాత వీరిద్దరూ ఏకంగా సహజీవనం చేస్తున్నారు. ఈ ప్రేమ పక్షులు విదేశీ పర్యటనలు, ఫంక్షన్లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
ప్రస్తుతం లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఈ ప్రేమ జంట గడుపుతోంది. ఈ నేపథ్యంలో మలైకా అరోరా చిట్‌చాట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా అర్జున్ కపూర్‌తో పెళ్లి వ్యవహారం ఏంటని ప్రశ్నించగా ఆమె ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చింది.
'పెళ్లిదేముంది.. ఏదో ఒక సమయంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలుసు. పరిస్థితులు అనుకూలిస్తే త్వరగానే మా నిర్ణయం చెబుతాం. అప్పటివరకు ఏదీ చెప్పలేన'ని మలైకా తెలిపింది. ఇక, పిల్లల గురించి అడిగిన ప్రశ్నకు మలైకా సమాధానం ఇవ్వలేదు.
తర్వాతి కథనం
