శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (22:26 IST)

పాక్‌లో మతమార్పిడి.. 14ఏళ్ల మైనార్టీ అమ్మాయికి 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

పాకిస్థాన్‌లో మైనార్టీ అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇప్పటికే వేలమంది మైనార్టీ అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి.. ఆపై బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి మార్చేసి.. ముస్లిం పురుషులకు పెళ్లి చేసేస్తున్నారు. 
 
తాజాగా తాజాగా సింధ్ ప్రావిన్స్‌లో పద్నాలుగేళ్ల మైనర్ హిందూ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి మతం మార్చారు. అంతేకాదు ఆ అమ్మాయిని 40 ఏళ్ల మహ్మద్‌ ఆచార్‌ అనే వ్యక్తి వివాహమాడాడు. దీనికి సంబంధించిన ఫోటోలు పాక్‌ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. మహ్మద్‌ ఆచార్‌ అనే వ్యక్తి.. సదరు మైనర్‌ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి మతం మార్చినట్లు తెలుస్తోంది. బాధితురాలి చేతితో నిఖాకు సంబంధించిన పేపర్లతో అతను ఫోటో కూడా దిగాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పాక్‌ మైనార్టీ సంఘాలు మండిపడుతున్నాయి. మైనార్టీ యువతులపై దాడులను ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.