ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (09:19 IST)

లాక్‌డౌన్‌లోనూ కట్టడికాని అత్యాచారాలు... బాలికపై బాలుడు రేప్

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ సమయంలోనూ బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డకట్ట పడలేదు. నేరాలు ఘోరాలు, దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాల సంఖ్య మాత్రం తగ్గినప్పటికీ.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. 
 
తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ బాలికపై 14 యేళ్ళ బాలుడు అత్యాచారానికి పాల్పపడ్డాడు. ఆడుకుందామని బాలికను నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చి ఈ ఘటనను పరిశీలిస్తే,
 
హైదరాబాద్ నగరంలోని మెహదీపట్నంలోని భోజగుట్ట ప్రాంతానికి  చెందిన ఓ బాలుడి కుటుం సభ్యులు బయటకు వెళ్లారు. ఇదే మంచి సమయమని భావించి.. పక్కింటి బాలికకు ఆడుకుందాం రమ్మని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.