థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ
Murali Krishnam Raju, Shruti Shetty
'తపనే తెలుపగ..' పాటకు పృథ్వీ పెరిచెర్ల అందమైన లిరిక్స్ అందించగా వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ శివ ప్రసాద్ బ్యూటిపుల్ మెలొడీ ట్యూన్ తో కంపోజ్ చేశారు. 'తపనే తెలుపగ..' పాట ఎలా ఉందో చూస్తే - 'తపనే తెలుపగ పలుకే, ఉసురే నిలిపెను పిలుపే, మనవే వినగా మనసే, మదినే గుడిలా మలిచే, అలసిన సమయం జతగా, అనుమతి అడగక రావా, కురిసెను విరహం కనులా, రగిలిన హృదయపు సడిలో..' అంటూ సాగుతుందీ పాట. హీరో హీరోయిన్స్ మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టిపై కూల్ మెలొడీగా ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు.
