శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:34 IST)

హైదరాబాద్ టు చెన్నై - 650 కిమీ ఒంటరిగా బైక్‌పై వెళ్లిన హీరో....

తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు, అభిమానగణం వున్న హీరోల్లో అజిత్ ఒకరు. పైగా, ఈయన అంతర్జాతీయ బైక్ రేసర్ కూడా. దీంతో ఆయన చేసిన సాహసం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. హైదరాబాద్ నుంచి చెన్నైకు ఏకంగా 650 కిలోమీటర్ల దూరం ఒంటరిగా బైకుపై ప్రయాణం చేశాడు. ఈ మధ్యలో కేవలం అన్నపానీయాలతో పాటు.. పెట్రోల్‌కు మాత్రమే మధ్యలో ఆగారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పైగా, హీరో అజిత్ బైక్ ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు షోషల్ మీడియాలో కనిపించడంతో అవి వైరల్ అయ్యాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అజిత్ హీరో వాలిమై అనే చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్ నగరంలో షూటింగ్ జరుపుకుంది. వాటిలో కొన్ని బైక్ ఛేజింగ్ సీన్లు కూడా ఉన్నాయి. పైగా, ఈ చిత్రంలో హీరో అజిత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో బైక్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఓ బైకును తయారు చేయించారు. 
 
ఈ బైకుపై ముచ్చటపడిన అజిత్.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత అదే బైక్‌పై చెన్నై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం చిత్ర నిర్మాతతో పాటు.. చిత్ర యూనిట్‌కు చెప్పారు. ఆ తర్వాత తనకు చేయించిన విమానం టిక్కెట్లను రద్దు చేసుకున్న అజిత్.. బైకుపై ఒంటరిగా చెన్నైకు బయలుదేరారు. తన అసిస్టెంట్‌ను మాత్రం విమానంలో చెన్నైకు పంపించారు.
 
ఇపుడు ఈ బైక్ రైడింగ్‌కు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం విడుదల చేసి విషయం చెప్పడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. పైగా, ఆయన ప్రయాణ సమయం మధ్యలో పెట్రోల్, టిఫిన్, ఆహారం కోసమే ఆగారు. విశ్రాంతి కోసం మధ్యలో ఎక్కడా ఆగలేదు. కాగా, గతంలో అజిత్ ఎన్నో బైకర్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా కూడా బైక్ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెల్సిందే. గతంలో ఒకసారి కూడా పూణె నుంచి చెన్నైకు బైకుపై వచ్చిన విషయం తెల్సిందే.